స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు సమర్థనీయమే: ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 50.42 శాతంగా తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. గత డేటాను కాకుండా, తాజా గణాంకాల ఆధారంగానే అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కోసం జీవోలు జారీ చేశామని, ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఉందని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.