భోగాపురంలో పింఛన్ల పంపిణీ: రావాడ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అందజేశారు. ఈ సందర్భంగా రావాడ పంచాయతీ పరిధిలోని రావాడ ఆర్ అండ్ బీ రోడ్డు నుండి చిన్న రావాడ వరకు సుమారు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అలాగే నాయకులు పాల్గొన్నారు.