రామ్ చరణ్ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ ఔట్?

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటైన డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ల సుదీర్ఘ ప్రయాణానికి బ్రేక్ పడింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'RC17' చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'పుష్ప 2' సమయంలో తలెత్తిన క్రియేటివ్ విభేదాలు, మనస్పర్థల కారణంగా డీఎస్పీ ఈ ప్రాజెక్ట్‌కు దూరమైనట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ లేదా శాశ్వత్ సంగీతం అందించే అవకాశం ఉంది.