తలలో పేల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా: పాటించాల్సిన సులువైన చిట్కాలు ఇవే
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తలలో పేలు, ఈరుల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జీఎస్ఎస్ సందీప్ తెలిపారు. తలకు ఆముదం లేదా నూనె రాసి సన్నటి దువ్వెనతో దువ్వడం వల్ల పేలు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. పర్మిత్రిన్ లోషన్ అప్లై చేసి క్లెన్సర్ తో తలస్నానం చేయాలని సూచించారు. ఈ సమస్య తీవ్రమైతే రక్తహీనత, రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉందని డాక్టర్ సందీప్ హెచ్చరించారు.