బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Mumbai

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తిపోట్ల ఘటనలో నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం మరోసారి దోషిగా అంగీకరించేందుకు కోర్టును ఆశ్రయించాడని అధికారులు తెలిపారు. జనవరిలో జరిగిన ఈ దాడి కేసులో గతంలో కోర్టు తిరస్కరించినప్పటికీ, గురువారం అతడు నేరాన్ని అంగీకరిస్తానని న్యాయస్థానానికి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని జడ్జి ఆదేశించారు.