ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం: గాల్లోనే పేల్చేసేందుకు ఇజ్రాయెల్ సిద్దం
రిపోర్టర్: శివ
స్థలం: డెహ్రాడూన్
దుబాయ్‌కి చెందిన ప్రముఖ ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కెప్టెన్‌పై దాడి చేసి హైజాక్ చేసేందుకు యత్నించినట్లు సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. ఈ ప్రమాదకర పరిణామాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు అప్రమత్తమయ్యాయని, విమానాన్ని గాల్లోనే కూల్చేసేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దించాయని పేర్కొన్నాయి. అయితే విమానం దిశ మారడంతో పెను ప్రమాదం తప్పిందని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.