పాల్వాయి గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా గణపతి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: వెంకటాపురం vishnu🙏 స్థలం: నల్గొండ

పాల్వాయి గ్రామంలో కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజారి నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. హైస్కూల్ గల్లీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద జెడ్పీ హైస్కూల్ గల్లీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుడిగ వెంకన్న–నాగమణి దంపతులు పూజల్లో పాల్గొన్నారు.