గ్రామాభివృద్ధికి చక్కటి నిదర్శనం: నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా సాగుతున్న పంచాయతీ పాలన
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చేజర్ల మండలం కాకివాయి గ్రామం ఎన్నికల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. నూట నలభై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గ్రామంలో గత అయిదేళ్లు మినహా అన్నిసార్లు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడు దశాబ్దాలుగా గ్రామస్థులందరూ ఐకమత్యంతో ఉంటూ మౌలిక వసతులు కల్పించుకుంటున్నారు. సమష్టి కృషితో పాఠశాలలు, రహదారులు అభివృద్ధి చేసుకున్నామని, ఒకే కుటుంబానికి నూట నలభై ఏళ్లుగా బాధ్యతలు అప్పగించామని స్థానికులు తెలిపారు.