మియాపూర్లోని టి.ఎన్.నగర్లో వైభవంగా వినాయక నవరాత్రి మహోత్సవాలు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మియాపూర్ పరిధిలోని టి.ఎన్. నగర్లో ‘అవిఘ్న యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తున్నారు. భక్తుల భజనలు, జయజయధ్వానాలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పులకరిస్తోంది. కాలనీవాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని లంబోదరుని ఆశీస్సులు అందుకుంటున్నారు. గంగాధర్ స్వామి ఇచ్చిన ప్రత్యేక హారతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.