మెగా డీఎస్సీ సీబీఐ విచారణ డిమాండ్‌ను తిరస్కరించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా

మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న సీబీఐ విచారణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా తిరస్కరించారు. ప్రతి ఆరోపణకూ అధికారులు ఆధారాలతో సమాధానాలు ఇచ్చారని తేల్చిచెప్పారు. అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తి చేశామని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే దుష్ప్రచారాలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు.