మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్ లో ఈనెల 23న కలప వేలం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్ లోఈనెల 23వ తేదీన కలప వేలం నిర్వహించనున్నట్లు ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపారు. ఈ వేలంలో 182 లాట్లలో సుమారు 45,449 ఘనపు చదరపు మీటర్ల కలప అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. టేకు, రేపు, కరక తదితర నాణ్యమైన కలప అవసరమైన స్థానిక ప్రజలు, వ్యాపారులు ఈ వేలంలో పాల్గొని ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.