టాలీవుడ్లో ఆసక్తికర పరిణామం: జార్జ్ క్రిష్ సెట్స్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్లో డైరెక్టర్ శ్రీనువైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ సినిమా షూటింగ్ సెట్స్‌కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, తన మంచి స్నేహితుడు సెట్స్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్ ఆకాంక్షించినట్లు తెలిపారు.