ఆర్టీసీ డ్రైవర్‌పై ద్విచక్రవాహనదారుడి విచక్షణారహిత దాడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తాడేపల్లి
తాడేపల్లి మండలం పెనుమాకలో ఆర్టీసి డ్రైవర్‌పై ద్విచక్రవాహనదారుడు దుర్గాప్రసాద్ దారుణంగా దాడి చేశాడు. బస్సుకు దారి ఇవ్వలేదని ప్రశ్నించినందుకు డ్రైవర్ యేసురాజుపై ప్రయాణికుల ముందే కాళ్లతో తూలుతూ దాష్టీకం ప్రదర్శించాడు. మహిళా కండక్టర్, ప్రయాణికులు వారించినా వినకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.