సినిమా ప్రదర్శనలో ఆలస్యంపై పీవీఆర్ ఐనాక్స్ కు భారీ జరిమానా
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
సినిమా ప్రదర్శనలో ఇరవై రెండు నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడంపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పీవీఆర్ ఐనాక్స్ సంస్థ నష్టపరిహారం, వ్యాజ్య ఖర్చులతో కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. సినిమా సమయానికి ప్రారంభం కాకపోవడంతో తనకు జరిగిన అసౌకర్యంపై ఒక న్యాయవాది ఫిర్యాదు చేయగా కమిషన్ ఈ సంచలన తీర్పు వెలువరించింది.