భారీ ఊరట: అక్టోబర్ లో రూ.2.31 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. అక్టోబర్ లో స్థూల జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల ముప్ పై ఒక్క వేల కోట్ల రూపాయలను దాటాయని, గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇరవై మూడు శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. దేశీయ లావాదేవీలు మరియు విదేశీ దిగుమతుల ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగిందని, రిఫండ్స్ పోను నికరంగా రెండు లక్షల మూడు వేల కోట్ల వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నారు.