తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన: అధికారులను అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం విస్తృతంగా పర్యటించారు. వరహానది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజల అప్రమత్తత, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. చిన్న గుమ్ములూరు, పెద్ద గుమ్ములూరు గ్రామాల్లో స్థానికులతో మాట్లాడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. ముప్పు పూర్తిగా తొలగే వరకు అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి స్పష్టంగా ఆదేశించారు.