'మెటా సాధారణ మధ్యవర్తి కాదు..': కేంద్ర ప్రభుత్వ కీలక ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటాను కేవలం సమాచారం చేరవేసే సాధారణ మధ్యవర్తిగా చూడలేమని, అదొక సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ వ్యాప్తిని నియంత్రిస్తున్నందున మెటాకు చట్టపరమైన రక్షణ (సేఫ్ హర్బర్ ఇమ్యూనిటీ) వర్తించదని పేర్కొన్నాయి. ఇకపై ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌పై నేరుగా భారతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (14C) కే సమాచారం అందిస్తామని మెటా హామీ ఇచ్చినట్లు తెలిపారు.