ఓటర్లకు ఈసీ భారీ ఊరట: ఫారం 6 దరఖాస్తులపై కీలక స్పష్టత

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదాలో పేరు లేని పౌరులు ఎలాంటి భయాలు లేకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. గతంలో ఓటు హక్ కు ఉండి ప్రస్తుతం జాబితాలో లేని వారు ఫారం 6 సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉండవని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.