గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్: మంత్రి అచ్చెన్నాయుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
గుడ్ల ఉత్పత్తి మరియు వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏటా రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ జాతీయ స్థాయిలో పద్దెనిమిది శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తూ రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆయన వెల్లడించారు.