వివేకా హత్య కేసుపై దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఎన్టీఆర్

వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయిందని, నలభై కోట్ల రూపాయల సుపారీ నిజం బట్టబయలైందని మాజీ మంత్రి మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా అన్ని వేళ్లూ గొడ్డలి పార్టీ అధినేతవైపే చూపిస్తున్నాయని తెలిపారు. ధైర్యముంటే వీటిపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.