ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం నాడు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక భేటీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న జల వివాదాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ అధికారిక సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.