నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాజాపేటలో రైతుల రాస్తారోకో ఆందోళన
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ బావుల వద్ద లో-వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో విద్యుత్ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.