నగరి గంగజాతర వైభవంగా నిర్వహించేందుకు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఘనంగా ఆహ్వానం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి ప్రాంత ప్రజల ఆరాధ్య గ్రామదేవతలైన దేశమ్మ, ఓరుగుంటాలమ్మల గంగజాతర ఉత్సవాలను పురస్కరించుకుని జాతర కమిటీ సభ్యులు బుధవారం మాజీ మంత్రి ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల అలంకరణ నిమిత్తం జాతర నిర్వాహకులకు ఆమె సంప్రదాయ పట్టుచీరలు, సారె సామగ్రిని అందజేశారు. గ్రామదేవతల చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ, వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవిరెడ్డి, సదాశివరెడ్డితో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.