ఫేక్ సిమ్ కార్డుల వినియోగానికి పాల్పడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో సైబర్ నేరాలు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమతి లేకుండా ఇతరుల ఐడీలతో సిమ్ కార్డులు తీసుకోవడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం నేరమని స్పష్టం చేసింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ప్రజలు సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తమ పేరిట ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలని సూచించింది.