లెజెండ్ షూటింగ్ అనుభవాలపై హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలుగులో తాను నటించిన లెజెండ్ సినిమా షూటింగ్ అనుభవం తన కెరీర్లోనే అత్యంత కష్టమైనదని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే వెల్లడించారు. మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు, పురుషాధిక్య ధోరణి తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయని ఆమె పేర్కొన్నారు. తన కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.