శారదా నది ఘాట్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

అనకాపల్లి శారదా నది ఘాట్ వద్ద వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. చింతామణి గణపతి దత్త క్షేత్రంలో మొక్కలతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాన్ని ఆయన తిలకించి, ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.