ఘనంగా సందీప్ కిషన్ కరికాల పూజా కార్యక్రమాలు: రెండు భాగాలుగా భారీ చిత్రం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

యుగంధర్ ముని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కరికాల చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ పాల్గొన్నారు. సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని, వచ్చే వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది.