ఉత్తమ యాంటీ నార్కోటిక్స్ అవార్డు గెలుచుకున్న ఈగల్ బృందానికి సన్మానం
రిపోర్టర్: విజయ్
స్థలం: Telangana
న్యూఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో ప్రతిష్టాత్మక ఉత్తమ అవార్డును దక్కించుకున్న ఈగల్ బృందాన్ని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఘనంగా సన్మానించారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీస్ అధికారికంగా వెల్లడించారు. అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, అంతర్జాతీయ దర్యాప్తులు, డార్క్ వెబ్ విశ్లేషణ వంటి కీలకమైన ఆరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ బృందాన్ని అభినందించారు.