సరైన అసెస్మెంట్ లింక్ అడిగిన అభ్యర్థిని తిరస్కరించిన హెచ్ఆర్ బృందం
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
నిరుద్యోగ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అసెస్మెంట్ కోసం ఇచ్చిన లింక్ ఓపెన్ కాకపోవడంతో సరైన లింక్ ఇవ్వాలని కోరిన ఓ అభ్యర్థి దరఖాస్తును సంబంధిత హెచ్ఆర్ బృందం రద్దు చేసింది. వివరాలు కోరినందుకు అభ్యర్థిని తిరస్కరించడంపై రెండిట్ వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అటెన్షన్ టూ డీటెయిల్ మిస్సయ్యారంటూ హెచ్ఆర్ సిబ్బంది ఇచ్చిన వివరణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.