ఫ్యూచర్ రిటైల్ పై సీబీఐ కొరడా: తొమ్మిది వందల కోట్ల కుంభకోణం గుట్టురట్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యూచర్ రిటైల్ సంస్థతో పాటు కిషోర్ బియాని, రాకేష్ బియానిలపై తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కుట్ర, మోసం ఆరోపణలతో ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిధుల మళ్లింపు ఆరోపణలపై ముంబైలోని ప్రమోటర్ల నివాసాల్ లో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.