అమలాపురం శేఖర్ థియేటర్ వద్ద పిఠాపురంలో అలా మొదలైంది సినిమా సందడి
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అమలాపురం
అమలాపురం శేఖర్ థియేటర్ వద్ద 'పిఠాపురంలో అలా మొదలైంది' సినిమా బృందం సందడి చేసింది. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా మొదటి షో చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి తిలకించింది. అనంతరం మంచి టాక్ రావడంతో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.