ఢిల్లీలో రాహుల్ గాంధీ లంచ్ ఆర్డర్ వివాదం: సోషల్ మీడియాలో రగడ
రిపోర్టర్: శివ
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద జరిగిన నిరసన దీక్షలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెప్పించిన లంచ్ ఆర్డర్ వివాదానికి దారితీసిందని సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయని తెలుస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ నుంచి తెప్పించిన ఆహార ప్యాకేజింగ్‌పై నాన్ వెజ్ గుర్తు ఉండటంతో పితృపక్షాలు, మంగళవారం రోజున ఆయన చికెన్ తిన్నారంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నట్లు సమాచారం. అయితే కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కోసం ఈ బల్క్ ఆర్డర్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.