పరిసరాల పరిశుభ్రతే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష యంటూ చైర్పర్సన్ పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ పట్టణంలో పరిసరాల పరిశుభ్రత ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. తాగునీటి ట్యాంకులపై మూతలు బిగించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.