నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర: హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 2న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు G Kishan Reddy వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఈ మహా పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని స్పష్టం చేస్తూ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి.