ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: జడ్చర్ల
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి తగిన ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి శ్రీ లలితాంబికా తపోవనంలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష కోసం నిర్వహించిన పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 190 మంది విద్యార్థులు కఠిన శ్రమతో శిక్షణ పొందారని ఆయన తెలిపారు.