ఘనంగా దారెలా వినాయక నిమ్మజ్జనం అన్నదాన కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముంచింగిపుట్టు
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం దారెలా పంచాయతీ దారెలా గ్రామంలో వినాయక నిమ్మజ్జనం ఘనంగా నిర్వహించారు. దింసా నృత్యాల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి పాల్గొన్నారు. వినాయక లడ్డును చెండా రమేష్ దక్కించుకున్నారు. చెండా మోహన్ రావు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నారాధన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.