పల్నాడు జిల్లాలో బాణసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

రిపోర్టర్: గోపి స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న కేఎస్ఎస్ బాణసంచా దుకాణంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో యజమాని భూమా సురేష్ సజీవ దహనమయ్యాడు. దీపావళి ఆఫర్లపై సోషల్ మీడియా కోసం రీల్ చేస్తుండగా టపాసుల రవ్వలు పడి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వాచ్‌మెన్ యలగాల మస్తాన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలనుార్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.