బొమ్మసముద్రం ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గెలుపే లక్ష్యంగా దేవాజీ ముమ్మర ప్రచారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన దేవాజీ స్థానిక ప్రజలను కలుస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.