ఐఐటీ కాన్పూర్ విద్యార్థి నుంచి జపాన్ జాతీయ క్రికెటర్‌గా అభిషేక్ ఆనంద్ ప్రయాణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Bihar
బీహార్‌లోని రోహతాస్ జిల్లాకు చెందిన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అభిషేక్ ఆనంద్ జపాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించారు. ఉద్యోగ నిమిత్తం జపాన్‌కు వెళ్లిన ఆయన, అక్కడ క్లబ్ క్రికెట్ ఆడుతూ జపాన్ టీ20 జట్టులో స్థానం సంపాదించారు. భారత్, జపాన్ మధ్య జరగనున్న చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌కు ముందు ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.