బుగ్గమఠం భూముల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: దిల్లీ

తిరుపతి బుగ్గమఠం భూముల వ్యవహారంలో వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మఠానికి చెందిన భూముల ఆక్రమణ ఆరోపణలపై ఈవో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ కేవీ విశ్వనాథ్, జస్టిస్ అరుణ్ పళ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే జాబితాలో ఆలస్యంగా చేరడంతో ధర్మాసనం దీన్ని సరిగా పరిశీలించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.