రూ. 2.79 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

చీపురుపల్లి నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. గరివిడి మండలంలో రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.