హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతోందని పోలీసులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం, శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు రావడంతో చార్మినార్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు నలభై ఐదు వేల మంది పోలీసులను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు పూర్తి చేసుకునేలా యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంది.