డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ: ప్రత్యేక కాంక్లేవ్ నిర్వహించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. యువతను గంజాయి మహమ్మారి నుంచి కాపాడేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను బలోపేతం చేసేందుకు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ను నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.