విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

రిపోర్టర్: శివ స్థలం: బయ్యారం

చదువును మధ్యలో ఆపేసిన వారికి మరో అవకాశం కల్పిస్తూ బయ్యారం ఓపెన్ స్కూల్ లో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు కోఆర్డినేటర్ ఎం.ధనంజయ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించాలని ఆయన సూచించారు.