బిహార్ మ్యూజియంకు ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు: టాప్ 10 జాబితాలో చోటు
రిపోర్టర్: సురేష్
స్థలం: నల్గొండ
బిహార్ మ్యూజియం ప్రపంచంలోని అత్యుత్తమ పది మ్యూజియంల జాబితాలో స్థానం దక్కించుకుందని యూజీసీ ఛైర్మన్, విద్యారంగ నిపుణులు ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ తెలిపారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మరియు పారిస్ లూవ్రే మ్యూజియంలను వెనక్కి నెట్టి బిహార్ మ్యూజియం ఈ అరుదైన ఘనత సాధించిందని పేర్కొన్నారు. భారతదేశంలోని సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం దేశానికే గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.