పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల ప్రయాణం విషాదంగా ముగిసింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొన్న ఘటనలో బోను రాంబాబు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన సోదరి ధనలక్ష్మి, మేనల్లుడు దేవ్ తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట గ్రామానికి చెందిన రాంబాబు తెనాలిలో హోటల్లో పనిచేస్తుండగా సొంతూరు నుంచి గాజువాక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.