ప్రజా పాలన దినోత్సవ వేడుకలతో పులకించిన దస్తూరాబాద్ పల్లెలు

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రామడుగు రమేష్ రామ నేతృత్వంలో పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, భక్తిప్రపత్తుల మధ్య జరిగింది.