కాగిత కారిడార్ రహదారి నిర్మాణంలో అడుగడుగునా నాణ్యత లోపాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న కాగిత కారిడార్ భారీ రహదారి తొలి వర్షానికే కోతకు గురైందని, రూ. 45 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనుల్లో అడుగడుగునా నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు రోజుల పాటు కురిసిన వర్షానికే రహదారి సగానికి పైగా ధ్వంసమైందని, కల్వర్టులు బీటలు వారాయని వారు తెలిపారు. పనులు పూర్తి కానందునే ఇలా జరిగిందని, లోపాలను గుత్తేదారే సరిచేస్తారని కారిడార్ పర్యవేక్షణ ఏఈ లలిత వివరించారు.