పండగ ప్రయాణ కష్టాలు: విజయవాడ మీదుగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో భారీ రద్దీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
దసరా, దీపావళి పండగల సీజన్ కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర కష్టాలు తప్పడం లేదని రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ, రెగ్యులర్ మరియు స్పెషల్ ట్రైన్లలో రిజర్వేషన్ బెర్త్‌లు పూర్తిగా నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తత్కాల్ టికెట్లపైనే ఆశలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు మరిన్ని ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.