రాష్ట్రంలో తుపాన్ల బీభత్సం: ప్రాణనష్టం తప్పించామని సీఎం చంద్రబాబు వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో వరుస తుపాన్ల ప్రభావంపై అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. విపత్తు నిర్వహణలో ఆర్టీజీఎస్ సాంకేతికత అద్భుతంగా పనిచేయడం వల్ల ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగామని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఐదు వేల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించామని సీఎం తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న గ్రామాల్ లో యుద్ధప్రతిపాదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.